: సూపర్ ఎర్త్ ను కనుగొన్న 'కెప్లర్'... 180 కాంతి సంవత్సరాల దూరంలో మరో సౌర వ్యవస్థ!


సుమారు 180 కాంతి సంవత్సరాల దూరంలో భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుగొన్నట్టు నాసా ప్రకటించింది. అంతరిక్షంలోని కెప్లర్ స్పేస్ క్రాఫ్ట్ దీన్ని కనుగొన్నట్టు నాసా తెలిపింది. ఈ కొత్త గ్రహం భూమి వ్యాసానికి రెండున్నర రెట్లు అధికంగా 20 వేల మైళ్ళ వ్యాసం కలిగి ఉందని, 12 రెట్ల అధిక బరువుతో ఉండొచ్చని తెలిపింది. సూర్యుని కన్నా చిన్నగా ఉన్న ఓ నక్షత్రానికి 84 లక్షల మైళ్ళ దూరంలో ఈ గ్రహం తిరుగుతోందని నాసా తెలిపింది. ఈ సూపర్ ఎర్త్ లో నీటి నిల్వలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News