: టీడీపీకి ముస్లింలపై ప్రేమ లేదు: భూమా


తెలుగుదేశం పార్టీకి ముస్లింలపై ప్రేమ, అభిమానం లేవని వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. హజ్ హౌస్ భవన నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైందని... కట్టడాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మరో వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ, హజ్ హౌస్ ను గుంటూరులో నిర్మించాలని... అప్పుడు రాజధానికి, రైలు, రోడ్డు, వాయు మార్గాలకు దగ్గరగా ఉంటుందని కోరారు.

  • Loading...

More Telugu News