: రెండో ఇన్నింగ్సులో తొలి వికెట్ కోల్పోయిన ఇండియా


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్సులో 144 పరుగులు చేసిన ఓపెనర్ మురళీ విజయ్... సెకండ్ ఇన్నింగ్సులో కేవలం 28 పరుగులకే పెవిలియన్ చేరాడు. స్టార్క్ బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 16 పరుగులతో క్రీజులలో ఉన్న ధావన్ కు పుజారా జత కలిశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు వికెట్ నష్టానికి 47 పరుగులు. ఆస్ట్రేలియా మరో 50 పరుగుల లీడ్ లో ఉంది.

  • Loading...

More Telugu News