: ఐఎస్ఎల్ టైటిల్ సమరంలో సచిన్, గంగూలీ జట్ల అమీతుమీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సాకర్ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సహ యజమానులుగా ఉన్న జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. సచిన్ కేరళ బ్లాస్టర్స్ కు సహ యజమాని కాగా, అట్లెటికో డి కోల్ కతా జట్టుకు గంగూలీ సహ యజమాని. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో శనివారం ఐఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అంతకుముందు, కోల్ కతా జట్టు సెమీస్ లో ఎఫ్ సీ గోవాను చిత్తు చేయగా, కేరళ బ్లాస్టర్స్ జట్టు చెన్నయిన్ ఎఫ్ సీ జట్టుపై గెలిచింది. కాగా, ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి.