: సానియాతో దాంపత్యంపై షోయబ్ స్పందన


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ దాంపత్య జీవితం ఒడిదుడుకుల్లో పడిందని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, కాపురం సజావుగా నడవడంలేదని ఆ కథనాల్లో పేర్కొన్నారు. త్వరలో విడిపోవచ్చని కూడా అంచనా వేశారు. వీటిపై షోయబ్ మాలిక్ స్పందించారు. తమ వైవాహిక జీవితం సాఫీగానే సాగుతోందని స్పష్టం చేశాడు. తమ మధ్య దృఢమైన బంధం నెలకొని ఉందని తెలిపాడు. సానియా, తాను దుబాయ్ లోనే ఉంటున్నామని, వీలైనంతగా కలిసి గడపడాన్ని ఇష్టపడుతున్నామని చెప్పాడు. అటు, పాకిస్థాన్ మీడియా కూడా పలు కథనాలు వెలువరించింది. షోయబ్ ఇటీవల నటి హుమైమా మాలిక్ తో తరచు కనిపిస్తున్నాడని పేర్కొంది. వీటిపైనా ఈ క్రికెటర్ వివరణ ఇచ్చాడు. హుమైమా ఓ మంచి ఫ్రెండ్ మాత్రమే అని స్పష్టం చేశాడు. తన వైవాహిక జీవితంపై వస్తున్న ఇలాంటి నిరాధారమైన వార్తలు చికాకు పరుస్తున్నాయని అన్నాడు.

  • Loading...

More Telugu News