: మళ్లీ కోర్టు మెట్లెక్కిన జగన్ టీం!
అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆయన బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జగన్, వైవీ సుబ్బారెడ్డిలతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా కోర్టుకు హాజరయ్యారు. నేటి విచారణకు హాజరైన వారిలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు ఆడిటర్, వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఉన్నారు.