: కౌలు రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది: వైకాపా సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి
కౌలు రైతుల పట్ల చంద్రబాబు సర్కారు వివక్ష చూపుతోందని వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. నేటి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆయన కౌలు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రుణాలిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటిదాకా అసలు ఆ దిశగా దృష్టి సారించిన పాపానపోలేదన్నారు. ఇప్పటినుంచైనా కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశ్వేశ్వరరెడ్డి ఆరోపణలపై స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్రంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా చేపట్టనున్నామని ప్రకటించారు.