: ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్... స్కోరు 422/8
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. 133 పరుగులు చేసిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఇషాంత్ శర్మ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అద్భుత పోరాట పటిమ కనబరచిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ 88 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం మిచెల్ స్టార్క్ 27 పరుగులతో, నాథన్ లియాన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా మరో 18 పరుగులు వెనుకబడి ఉంది.