: రైతు సమస్యలపై వైకాపా వాయిదా తీర్మానం


రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా, కరవు, అన్నదాతల ఆత్మహత్యలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండో రోజు సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రైతు సమస్యలపై సభలో చర్చించాలని కోరుతూ వైకాపా వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా, వ్యాట్ చట్టసవరణ బిల్లు ఇవాళ శాసనసభ ముందుకు రానుంది. ఈ సమావేశాలు డిసెంబర్ 23వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News