: అగ్ర కులాల వల్లే తెలంగాణలో వెనుకబడిన కులాలు ఎదగలేదు: పొన్నాల


తెలంగాణ ప్రాంతంలో అగ్ర కులాల పెత్తనం తీవ్ర స్థాయిలో ఉందని... అందువల్లే వెనుకబడిన వర్గాలు రాజకీయంగా ఎదగలేక పోయాయని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో, బీసీ కులాలు రాజకీయంగా చైతన్యం అయి, కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీల పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సామాజిక న్యాయం ఉందని పొన్నాల తెలిపారు. తెలంగాణ లోని వివిధ జిల్లాలకు చెందిన గొల్ల, కురుమ సంఘాలకు చెందిన పలువురు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నాల, పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News