: హైదరాబాదును ఇప్పటికీ ఏపీలోనే చూపుతున్న అనేక ప్రముఖ సంస్థలు
రాష్ట్రం విడిపోయి 6 నెలలు దాటినా... హైదరాబాదు నగరం ఇప్పటికీ ఏపీలోనే ఉన్నట్టుగా అనేక సంస్థలు చూపుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటికీ ఆ సంస్థలన్నీ ఈ విషయాన్ని గుర్తించడం లేదు. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో సైతం ఇప్పటికీ హైదరాబాద్ ఏపీలోనే ఉంది. మారుతి, బీఎండబ్ల్యూ, ఫోక్స్ వాగన్, బజాజ్, మహీంద్రాలతో పాటు ఈ కామర్స్ సైట్లు ఫ్లిప్ కార్ట్, జబాంగ్ తదితర సైట్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీరంతా తెలంగాణ ఏర్పడిన సంగతిని ఎప్పటికి గుర్తిస్తారో?