: నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు: అయ్యన్నపాత్రుడు
గతంలో రాజకీయాల్లో విలువలు ఉండేవని... ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎమ్మెల్యేలకు గతంలో ఉన్న గౌరవ మర్యాదలు ప్రస్తుతం లభించడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో, తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని తెలిపారు. నిన్న అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.