: తిరుపతి టికెట్ వెంకటరమణ భార్యకే!
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మరణం నేపథ్యంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానంలో ఆయన భార్యకు అవకాశం కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసిన వెంకటరమణ భార్య సుగుణ సమర్థురాలేనని నిన్నటి టీడీఎల్పీ భేటీ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన వెంకటరమణ, సుగుణ దంపతులకు ఇద్దరు కూతుర్లున్నారు. అయితే వారిద్దరూ బధిరులే కావడంతో తిరుపతి అసెంబ్లీ టికెట్ ను వెంకటరమణ భార్య సుగుణకే ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెంకటరమణ భార్యను రంగంలోకి దించడంతో విపక్షం కూడా అక్కడ అభ్యర్థిని నిలిపే అవకాశాలుండవని కూడా బాబు యోచిస్తున్నారు.