: రాజధాని కోసం భూములు ఇవ్వమంటూ వెలసిన బోర్డులు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు రాజధాని నిర్మాణం కోసం తమ భూములు త్యాగం చేయలేమని పోలాల్లో బోర్డులు ఏర్పాటు చేసిన సంగతి వెలుగు చూసింది. మూడు పంటలు పండే తమ భూములను ల్యాండ్ పూలింగ్ కోసం ఇవ్వలేమని చెబుతూ కొందరు రైతులు పొలాల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్టు రాజధాని ఏర్పాటుకు భూములిచ్చేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేది అవాస్తవమని రూఢీ చేశారు.