: తెలంగాణలో కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్స్ రద్దుకు కేసీఆర్ సుముఖత
తెలంగాణలో కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్సును రద్దు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. సచివాలయంలో తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంఘం కలిసిన సందర్భంగా పలు వినతులు చేశారు. సెట్ టాప్ బాక్సులు తప్పనిసరన్న విధానం తమకు ఇబ్బందికరంగా మారిందని, దానిని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కేబుల్ ఆపరేటర్లు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కేబుల్ ఆపరేటర్లకు తాను అండగా ఉండి.. ప్రభుత్వం తరపున సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని వారు వివరించారు.