: బాలిక తల్లికి 10 లక్షల పరిహారం ఇవ్వండి: సుప్రీం ఆదేశం


మణిపూర్ లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మరణించిన బాలిక తల్లికి పరిహారం అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అస్సాం రైఫిల్స్ జరిపిన కాల్పుల్లో ఓ బాలిక మృతి చెందింది. దీనిపై బాలిక తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు అస్సాం రైఫిల్స్ ది తప్పుగా నిర్థారిస్తూ 10 లక్షల రూపాయల నష్టపరిహారం బాలిక తల్లికి అందజేయాలని ఆదేశించింది. కాగా, మణిపూర్ లో భద్రతాదళాల ఆగడాలపై పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సైన్యానికి, భద్రతా దళాలకు ఉన్న ప్రత్యేక అధికారాలను తొలగించాలని కోరుతూ చాను షర్మిళ 14 ఏళ్లుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News