: మారణ కాండతో కళ్లు తెరిచిన పాక్...చిత్తశుద్ధిగానేనా?
పెషావర్ దారుణ మారణకాండతో పాకిస్థాన్ కళ్లు తెరిచింది. దీంతో తీవ్రవాదులపై చర్యలకు ఉపక్రమించింది. తాలిబాన్ల ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు మరణశిక్ష పడి పాకిస్థాన్ జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గుతున్న తీవ్రవాదులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాగా, పాక్ తీరుపై విదేశీ వ్యవహారాల పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాక్ కు చిత్తశుద్ధి ఉంటే పెషావర్ నెత్తురోడి 48 గంటలు కూడా గడువక ముందే ముంబై దాడుల సూత్రధారిని ఎలా బెయిల్ పై విడుదల చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్ తీరు అంతర్జాతీయ సమాజం ముందు తీసికట్టుగా ఉండకుండా ఉండేందుకు తీవ్రవాదులపై చర్యలు అంటూ నాటకమాడుతోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.