: సోనియా గాంధీకి అస్వస్థత...ఆసుపత్రికి తరలింపు


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. గతంలో యూపీఏ అధికారంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, చివరి క్షణంలో అయినా కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని భావిస్తున్నారని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేశారని పలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఆమె ఆరోగ్య స్థితిపై మరోసారి పలు కథనాలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News