: దేశంలో అత్యంత డబ్బున్న గ్రామంగా ధర్మాజ్


గుజరాత్‌ లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ అనే మారుమూల కుగ్రామం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం, ఆ గ్రామం దేశంలోనే అత్యంత ధనిక గ్రామంగా పేరొందడమే. ఆ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు చేసిన బ్యాంకింగ్ డిపాజిట్ల ద్వారా ధర్మాజ్ గ్రామం అత్యంత ధనిక గ్రామంగా అవతరించింది. 90 వేల కోట్ల రూపాయలతో కేరళలోని ఓ గ్రామం ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లతో అగ్రస్థానాన్ని అందుకోగా, దానిని తోసిరాజని ధర్మాజ్ గ్రామం వెయ్యి కోట్ల రూపాయల డిపాజిట్లతో అగ్రస్థానం సంపాదించి వార్తల్లో నిలిచింది. ఈ విషయాన్ని వడోదర డివిజన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. హిర్వే మీడియాకు వివరించారు. కాగా, ధర్మాజ్‌ గ్రామంలో 3 వేల కుటుంబాలు ఉండగా ఆయా కుటుంబాల నుంచి కొందరు అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో స్థిరపడ్డారు. వారంతా స్వగ్రామంలోని బ్యాంకులోనే డిపాజిట్లు వేయడంతో ఆ గ్రామం ధనికగ్రామంగా అవతరించింది.

  • Loading...

More Telugu News