: విజయవాడలో న్యాయవాది చిరంజీవి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
కృష్ణా జిల్లా విజయవాడలోని మొగల్రాజపురంలోని న్యాయవాది చిరంజీవి ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన ఫ్లాట్ ను కానికొండ చిరంజీవి కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దానిని పరిశీలించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు న్యాయవాది చిరంజీవి ఆఫీస్ కు చేరుకున్నారు. పోలీసులు వచ్చారని సమాచారం తెలుసుకున్న న్యాయవాదులు కూడా ఆయన ఆఫీస్ కు చేరుకున్నారు. దీంతో పోలీసులు, న్యాయవాదుల మధ్య వివాదం రేగింది. పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ నైట్ డామినేషన్' అంటూ నగర ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న పోలీస్ కమిషనర్ పై కేసు వేసి స్టే తెచ్చినందుకు ప్రతిగా న్యాయవాది చిరంజీవిని వేధిస్తున్నారని, వారు ఆరోపిస్తున్నారు.