: విష్ణువర్ధన్ రెడ్డిపై మరో కేసు
మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తనపై దాడికి పాల్పడ్డారంటూ ఇప్పటికే కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ఈ రోజు విష్ణు ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఆయన లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. మరోవైపు, ఇదే ఘటనలో విష్ణుపై పోలీసులు మరో కేసు పెట్టారు. డ్యూటీలో ఉన్న వంశీ గన్ మెన్ పై విష్ణు దాడిచేశారంటూ, ఆయనపై క్రిమినల్ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు.