: గాలికి బెయిలు... అయినా జైల్లోనే!
ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ స్కాంలో హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. అయినప్పటికీ ఆయన జైల్లోనే ఉండనున్నారు. సుప్రీంకోర్టులో ఓఎంసీ మైనింగ్ కేసు విచారణ పెండింగ్ లో ఉండడంతో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ ఆయన బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గతంలో పలు కేసుల్లో ఆయనకు బెయిలు మంజూరైనప్పటికీ ఆయన బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టలేకపోయారు. కీలకమైన ఓఎంసీ మైనింగ్ కేసు విచారణ కొనసాగుతోంది.