: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
వరుసగా ఐదు సెషన్లలో నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 416 పాయింట్లు పెరిగి 27,127కి చేరింది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 8,159కి ఎగబాకింది. టోరెంట్ పవర్, హెచ్ డీఐఎల్, డీసీబీ బ్యాంక్, రెడింగ్టన్ ఇండియా లిమిటెడ్, పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. పీఎంసీ ఫిన్ కార్ప్, గుజరాత్ మినరల్స్ డెవలప్ మెంట్, రసోయా ప్రొటీన్స్, హ్యాత్ వే కేబుల్ అండ్ డేటా, కైలాష్ ఆటో ఫైనాన్స్ కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.