: నవజ్యోత్ సింగ్ సిద్దూ కాన్వాయ్ పై రాళ్ల దాడి
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు వెళ్ళిన మాజీ క్రికెటర్, బీజేపీ మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దూకు చేదు అనుభవం ఎదురైంది. నేటి ఉదయం ఆయన ప్రయాణిస్తున్న వాహనశ్రేణిపై జమ్మూలో రాళ్లదాడి జరిగింది. అయితే ఈ దాడిలో ఆయనకు ఎలాంటి హానీ జరగలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా, జమ్మూ కాశ్మీర్లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారంతో గడువు ముగియనుంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.