: 26/11 ముంబయి దాడుల నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన పాక్ కోర్టు


నవంబర్ 26, 2008లో లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్మాదంతో ముంబయిపై చేసిన దాడుల్లో 166 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే తాయిబా సీనియర్ కమాండర్ అయిన జకీ-ఉర్-రెహ్మాన్ లక్వీ ప్రస్తుతం పాకిస్థాన్ లోని రావల్పిండి జైల్లో ఉన్నాడు. ఈ కిరాతకుడికి పాక్ లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. 26/11 ఘటనకు సంబంధించిన కేసును త్వరగా విచారించి, నిందితులకు శిక్ష ఖరారు చేయాలని ఓ వైపు పాక్ ను ఇండియా కోరుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, లక్వీకి బెయిల్ మంజూరు కావడం గమనార్హం. పాక్ తాలిబన్లు పెషావర్ లో కొనసాగించిన నరమేధంతో ఓ వైపు పాక్ జాతీయులు విలపిస్తుంటే... మరోవైపు ఉగ్రవాద నాయకుడికి పాక్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం ఆశ్చర్యకరమైన విషయం.

  • Loading...

More Telugu News