: ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత... నిజాయతీ అంటే ఏంటో చూపిస్తా: చక్రపాణి


ఇకపై తెలంగాణలో పూర్తి పారదర్శకతతో ఉద్యోగాల భర్తీ జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టిన గంటా చక్రపాణి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతికి అడ్డాగా ఉండేదని, తెలంగాణ ప్రభుత్వంలో అవినీతికి తావులేకుండా, నిజాయతీ అంటే ఏమిటో చూపిస్తామని ఆయన అన్నారు. తనకు చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని ఓ పదవిగా భావించకుండా, బాధ్యతగా విధులు నిర్వహిస్తామన్న చక్రపాణి విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నా చేయాల్సిన అవసరం రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News