: లైంగిక వాంఛలు తీర్చలేదని 150 మంది మహిళలను హతమార్చిన ఐఎస్ఐఎస్
రాక్షసత్వానికి మారుపేరులా తయారైన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మరో దారుణానికి ఒడిగట్టింది. తమ లైంగిక వాంఛలు తీర్చలేదని ఏకంగా 150 మంది మహిళలను తుపాకులతో కాల్చి చంపేశారు. వీరిలో యువతులు, గర్భవతులు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కిరాతకాన్ని అడ్డుకునేందుకు వచ్చిన 91 మంది పురుషులను కూడా చంపారు. అనంతరం వీరందరినీ సామూహికంగా ఖననం చేశారు. ఈ దారుణ ఘటన ఇరాక్ లోని ఫాజుల్లా పట్టణంలో చాలా రోజుల క్రితమే చోటు చేసుకున్నా... ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దారుణానికి అల్ అన్బర్ ప్రావిన్స్ లోని జిహాదీ నేత అబూ అనాస్ అలి లిబి నేతృత్వం వహించారని పాక్ మీడియా కథనాలను వెలువరించింది.