: ఇక ప్రతి శనివారం ఎమ్మెల్యేలతో భేటీ: ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు బాగానే ఆకర్షితుడైనట్లున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ ప్రచారంపై ఆసక్తి కనబరిచిన చంద్రబాబు, అవకాశం చిక్కినప్పుడల్లా మోదీ పాలన తీరుపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మోదీ చర్యలను అనుకరించాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇకపై ప్రతి శనివారం ఎమ్మెల్యేలతో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ భేటీలకు మంత్రులు కూడా అందుబాటులో ఉండాలని ఆయన నేటి టీడీఎల్పీ భేటీలో ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రతి మంగళవారం పార్టీ ఎంపీలతో మోదీ సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ తరహాలోనే తాను కూడా ఎమ్మెల్యేలతో భేటీ కావాలని నిర్ణయించిన చంద్రబాబు, ఈ భేటీలను ప్రతి శనివారం నిర్వహించనున్నారు. జనవరి నుంచి ఈ భేటీలు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News