: తాలిబన్లపై పాక్ వైమానిక దాడులు షురూ... 57 మంది ఉగ్రవాదులు హతం


పెషావర్ ఆర్మీ స్కూల్ పై ఉగ్రదాడి పాకిస్థాన్ పాలకుల కళ్లు తెరిపించినట్లుంది. సైనిక పాఠశాలలోకి చొరబడ్డ తాలిబన్లు 145 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన పాక్, దాడి జరిగిన మరునాటి నుంచే ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి దిగింది. ఖైబర్ ఏజెన్సీలోని తిరా లోయపై ఆ దేశ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో బుధవారం 57 మంది దాకా ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ అసిమ్ బజ్వా ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఉగ్రవాదులపై తమ సైన్యం జరుపుతున్న వైమానిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయని, ఉగ్రవాదులను ఏరివేసేదాకా దాడులను ఆపేది లేదని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News