: ఆరు రోజుల పర్యటనకు భారత్ రానున్న బంగ్లాదేశ్ అధ్యక్షుడు


బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆరు రోజుల పర్యటనకు గాను నేడు భారత్ రానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనను భారత్ కు ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్ లో తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అబ్దుల్ హమీద్ బృందం భారత రాష్ట్రపతితో చర్చలు జరపడమే గాకుండా, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారితో కూడా భేటీ కానుంది.

  • Loading...

More Telugu News