: పెషావర్ ఘటనతో కన్నీటి పర్యంతమైన పాక్ ఓపెనర్


పెషావర్ లోని ఓ సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడి చేసి వందలాదిగా విద్యార్థులను బలిగొనడంపై సర్వత్ర విచారం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో అబుదాబిలో పాకిస్థాన్ జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సందర్భంగా, పెషావర్ ఘటన గురించి తెలిసిన వెంటనే క్రికెటర్లందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. బుధవారం ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే జరిగింది. చిన్నారుల మృతికి సంతాపంగా మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ సమయంలో పాక్ ఓపెనర్ అహ్మద్ షేజాద్ కన్నీటి పర్యంతమయ్యాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేక విలపించాడు. ఈ సందర్భంగా అందరి గుండెలు బరువెక్కాయి. కాగా, పాక్ సీనియర్ క్రికెటర్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ, సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడి జాతీయ విషాదంగా పరిగణించాల్సిన ఘటన అని, అనాగరిక చర్య అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News