: ఉగ్రవాదాన్ని తీవ్రంగా పరిగణిస్తే... ఆ ఇద్దరిని అప్పగించండి: పాక్ కు వెంకయ్య సూచన
పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడి నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరును మొదలుపెట్టాల్సిందేనని పాకిస్థాన్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో భారత్ ఆ దేశానికి పలు సలహాలు, సూచనలు చేయడంతో పాటు ఉగ్రవాదులను రక్షిస్తున్న ఆ దేశ నేతల వైఖరిని దునుమాడింది. ఉగ్రవాదాన్ని నిజంగా తీవ్రంగా పరిగణించేందుకు తీర్మానిస్తే, ముందుగా పాక్ భూభాగంలోని తీవ్రవాదులపై చర్యలు తీసుకోవాలని భారత్ సవాల్ విసిరింది. అంతేకాక పాక్ భూభాగంపై ఉంటూ, మా దేశంపై దాడులు చేసిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంలను అప్పగించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తద్వారా ఉగ్రవాదులపై పోరులో తమ సహకారాన్ని కూడా తీసుకోవచ్చని ఆయన ప్రకటించారు.