: నా వ్యక్తిగత స్వేచ్ఛను మీడియా హరిస్తోంది: ధ్వజమెత్తిన అంబరీష్
తాను ఏమి చెప్పినా, ఏమి మాట్లాడినా మీడియా వక్రీకరిస్తోందని, వ్యతిరేకార్థాలు తీస్తోందని సినీనటుడు, కర్ణాటక రాష్ట్ర మంత్రి అంబరీష్ మండిపడ్డారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా మీడియా ప్రవర్తన ఉందని అన్నారు. 'రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన నాకు వ్యక్తిగత జీవితం ఉండదా? నా బిడ్డలు, మనవళ్లకు ముద్దిచ్చినా వివరీతార్థాలు తీస్తారా?' అని ప్రశ్నించారు. మంచి విషయాలనే ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు సూచించారు. 'ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు మీ చానళ్లు, పత్రికల్లో వస్తాయా? లేదా?' అంటూ విలేకరులను నిలదీశారు.