: ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
జీఎస్ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమవడం సంతోషం. ఈ విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు’’ అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన ఇస్రో, భవిష్యత్తులో అధిక బరువు కలిగిన ఉపగ్రహాల ప్రయోగానికి, అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు మార్గం సుగమం చేసింది.