: మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... స్కోరు 124/3
బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ టాప్ ఆర్డర్ తడబడింది. 29 పరుగులకే ఓపెనర్ వార్నర్ ఔటవ్వగా... మంచి ఊపు మీదున్న మరో ఓపెనర్ రోగర్స్ 55 పరుగుల వద్ద ఉమేష్ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 25 పరుగులు చేసిన వాట్సన్ అశ్విన్ బౌలింగ్ లో ధావన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు. షాన్ మార్స్ 3 పరుగులతో, స్టీవెన్ స్మిత్ 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా మరో 284 పరుగులు వెనుకబడి ఉంది.