: నిప్పులు కక్కుతూ నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3... ఇస్రో చరిత్రలో మరో విజయం
అత్యంత బరువున్న వ్యోమగాముల గదితో (క్రూ మాడ్యూల్) అంతరిక్షంలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతమైంది. కొద్దిసేపటి క్రితం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు కక్కుతూ జీఎస్ఎల్వీ మార్క్-3 నింగిలోకి దూసుకెళ్లింది. రూ.155 కోట్ల ఖర్చుతో నిర్మించిన జీఎస్ఎల్వీ మార్క్-3 కేవలం 325 సెకన్లలోనే 3,735 కిలోల బరువున్న వ్యోమగాముల గదిని నిర్ణీత కక్ష్యలో (భూమికి126 కిలో మీటర్ల ఎత్తులో) ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో చరిత్రలో మరో విజయం చేరింది. జీఎస్ఎల్వీ విజయం నేపథ్యంలో చైర్మన్ రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలను అభినందించారు.