: మేం అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్థితి కూడా అంతే: జగన్ హెచ్చరిక


శాసనసభ సమావేశాలు వాడీవేడిగా ఆరంభమయ్యాయి. తొలి రోజే ప్రతిపక్షాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత తనకు మైక్ ఇవ్వలేదని అన్నారు. మాట్లాడాలని తనను కోరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఉద్దేశించి మాట్లాడుతూ "రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి స్పీకర్ మీరే. సంప్రదాయాలను పాటించాలి" అని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. రేపు తాము అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని జగన్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News