: అక్కడ 9వ తరగతిలో ఒక్కడే మిగిలాడు!


పాకిస్థాన్ లో పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడిలో వందలాది విద్యార్థులు విగతులయ్యారు. సైనిక యూనిఫాంలో వచ్చిన కిరాతకులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో పాఠశాల నెత్తురోడింది. ముఖ్యంగా, 9వ తరగతి విద్యార్థుల్లో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు విడిచారు. దావూద్ ఇబ్రహీం అనే విద్యార్థి అంతకుముందు రోజు ఓ పెళ్లికి వెళ్లడంతో దాడి జరిగిన రోజున పాఠశాలకు వెళ్లలేకపోయాడు. ఆలస్యంగా నిద్రపోవడంతో ఉదయం త్వరగా మెలకువరాలేదు. అదే అతని పాలిట అదృష్టంలా పరిణమించింది. స్కూలుకు వెళ్లకపోవడంతో తాలిబన్ల తుపాకీ గుళ్ల వర్షాన్ని తప్పించుకున్నాడు. అయితే, మిత్రులు మరిలేరన్న విషయం తెలుసుకున్న ఇబ్రహీం, వారి అంత్యక్రియలు చూసినప్పటి నుంచి మౌనంగా ఉంటున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News