: సహారా చీఫ్ సుబ్రతా రాయ్ బెయిల్ కు సుప్రీంకోర్టు నిరాకరణ


సహారా చీఫ్ సుబ్రతా రాయ్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాని నేపథ్యంలో సుబ్రతా రాయ్ సహా సహారాకు చెందిన ఇద్దరు డైరెక్టర్లకు బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు తేల్చిచెప్పింది. మదుపరులకు డబ్బు తిరిగి చెల్లించే విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన సుబ్రతా రాయ్ సహా, ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు మార్చి 4న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం సుబ్రతా రాయ్ బెయిల్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ‘‘మీ పరిస్థితిని మేం అర్థం చేసుకున్నాం. అయితే మునుపటి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో బెయిల్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోలేం’’ అని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News