: అసెంబ్లీకి వెళ్లేముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు నివాళి
శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంటే పార్టీ ప్రముఖులు ఉన్నారు. అనంతరం, బాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి బయల్దేరారు. అటు, శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం ప్రారంభమైంది.