: స్నేహితురాలిని పెళ్లాడిన మహిళా టెన్నిస్ లెజెండ్


టెన్నిస్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా (58) సాహసం చేసింది! ఎంతో కాలంగా తాను డేటింగ్ చేస్తున్న జూలియా లెమిగోవాను పెళ్లాడింది. తాను తొలిసారిగా పెళ్లాడానని నవ్రతిలోవా పేర్కొంది. వీరిద్దరూ 2006 నుంచి డేటింగ్ చేస్తున్నారు. నవ్రతిలోవాతో వివాహంపై లెమిగోవా మాట్లాడుతూ, ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. కాగా, 42 ఏళ్ల లెమిగోవా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు 1990లో 'మిస్ యూఎస్ఎస్ఆర్' టైటిల్ నెగ్గింది. 1991లో నిర్వహించిన మిస్ యూనివర్స్ అందాల పోటీలో సెకండ్ రన్నరప్ గా నిలిచింది.

  • Loading...

More Telugu News