: ఒబామాను వెయిటర్ అనుకున్నారట!
నల్లజాతీయుల వెతలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెరపైకి తెచ్చారు. ఇప్పటికీ వారికి చేదు అనుభవాలు తప్పవు అనడానికి తానే ఉదాహరణ అన్నారు. భార్య మిషెల్ తో కలిసి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంగతులు పంచుకున్నారు. గతంలో ఓసారి తనను వెయిటర్ గా కొందరు పొరబడ్డారని తెలిపారు. నల్లజాతి వ్యక్తిని కావడంతోనే వారు అలా భావించారని వివరించారు. ఓ పార్టీలో ఒబామాకు ఈ అనుభవం ఎదురైందని మిషెల్ పేర్కొంది. వారు ఒబామాను కాఫీ తెమ్మని పురమాయించారని తెలిపింది. తనకూ అలాంటి అనుభవమే ఎదురైందని, ఓసారి షాపింగ్ కు వెళితే, షాపులో ఓ మహిళ ఏదో వస్తువు తీసుకురమ్మని చెప్పిందని అధ్యక్షుల వారి భార్య గుర్తు చేసుకుంది.