: బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 ఆలౌట్
బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 408 పరుగులకు ఆలౌటైంది. 311/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ చివరి 6 వికెట్లను త్వరితగతిన చేజార్చుకుంది. రోహిత్ శర్మ 32, కెప్టెన్ ధోనీ 33, అశ్విన్ 35 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో పేసర్ హాజెల్ ఉడ్ కు 5 వికెట్లు దక్కాయి. ఆఫ్ స్పిన్నర్ లియాన్ 3 వికెట్లు తీశాడు. కొద్దిసేపట్లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించనుంది.