: రోహిత్ శర్మ ఔట్... ఆరు వికెట్లకు భారత స్కోరు 350


టీమిండియా రెండో టెస్టు రెండో రోజు ఆటలో తడబడుతోంది. రెండో రోజు ఆట ప్రారంభం కాగానే సెంచరీకి చేరువైన అజింక్యా రహానే వికెట్ ను కోల్పోయిన టీమిండియా మరో 7 పరుగుల అనంతరం స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. వచ్చీరాగానే ధాటిగా బ్యాటింగ్ కు దిగిన రోహిత్ 55 బంతుల్లో 32 పరుగులు చేశాడు. షేన్ వాట్సన్ బౌలింగ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేతికి చిక్కిన రోహిత్ పెవిలియన్ చేరాడు. దీంతో, కెప్టెన్ ధోనీ(17)కి, ఆల్ రౌండర్ గా తన సత్తా చాటిన రవిచంద్రన్ అశ్విన్(9) జత చేరాడు. 96 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 350 పరుగుల మైలురాయిని చేరుకుంది.

  • Loading...

More Telugu News