: 'ఎన్టీఆర్ వైద్య సేవ'గా రాజీవ్ ఆరోగ్యశ్రీ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీని పూర్తిస్థాయిలో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’గా పేరు మారుస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్య సేవలు ఉచితంగానే అందించిన ఈ పథకం లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను నిలిపిందనే చెప్పాలి. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని కొనసాగించేందుకు మొగ్గుచూపినా పేరు మార్చాలని నిర్ణయించారు. దీంతో, మొన్నటిదాకా ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా కొనసాగింది. తాజాగా, దీనిని ప్రభుత్వం ‘ఎన్టీఆర్ వైద్య సేవ’గా మార్చేసింది.