: షరీఫ్ తో సమావేశం ఇష్టం లేకున్నా... దేశ సమైక్యత కోసం వెళ్లా: ఇమ్రాన్ ఖాన్


గత నాలుగు నెలలుగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్న తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నిరసన కార్యక్రమాలను కొనసాగించరాదని... వాటన్నింటినీ తక్షణమే ఆపి వేస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిలో 141 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో, అరాచక శక్తులను ఎదుర్కొనే క్రమంలో దేశమంతా సంఘటితం కావాల్సిన ఆవశ్యకత ఉందని... అందుకే రాజకీయాలను పక్కన పెట్టి ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పారు. పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలంటూ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిన తర్వాత... షరీఫ్ తో కలసి సమావేశంలో పాల్గొనడానికి మనసు అంగీకరించలేదని... అయినా, దేశ శ్రేయస్సుకోసం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఏకతాటి మీద నడవడం కోసం భేటీకి హాజరు కావాలని నిర్ణయించామని ఇమ్రాన్ చెప్పారు. తన జీవితంతో ఇంతటి ఘోరాన్ని (నరమేధం) చూడలేదని... చిన్న పిల్లలను ఇంత దారుణంగా ఎలా చంపుతారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News