: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి
వివిధ కారణాలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా, హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని మాధవరం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటిలోనే ఉరి వేసుకుని తనువు చాలించాడు. నాలుగు నెలల క్రితమే ఇతనికి వివాహం అయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.