: ఐదు ముసాయిదా బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం... వివరాలు
దాదాపు ఐదు గంటలపాటు కొనసాగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో 5 ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన ముసాయిదా బిల్లులు ఇవే. 1) రాజధానికి సంబంధించిన సీఆర్ డీఏ బిల్లు పూర్తి స్వరూపానికి ఆమోదం. ఎల్లుండి సీఆర్ డీఏ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయం. 2) యూనివర్శిటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు. ఎయిడెడ్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు. 3) ఎర్ర చందనం అక్రమ రవాణాపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం. ఈ-వేలంపై కూడా సమావేశంలో చర్చించారు. 4) ధాన్యం అమ్మకాలపై నిబంధనలు సడలించాలని నిర్ణయం. రైతులు ఏపీలో ఎక్కడైనా తమ ధాన్యం అమ్ముకోవచ్చు. రైతులే స్వయంగా సీఎస్ టీ చెల్లించి తెలంగాణలోనూ అమ్ముకోవచ్చు. 5) 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం.