: కుమారుడి స్కూల్ కు వెళ్లిన మహేష్ బాబు


సినిమా షూటింగులతో క్షణం తీరిక లేకుండా ఉండే హీరో మహేష్ బాబుకు కుటుంబంతో గడపడానికే సమయం సరిపోదు. అలాంటిది, పోయిన వారం తీరిక చేసుకుని, సర్ ప్రైజింగ్ గా తన కుమారుడు గౌతమ్ చదువుతున్న స్కూల్ కు వెళ్లాడు. స్కూల్ లో ఓ కార్యక్రమం జరిగితే, అందరు తల్లిదండ్రుల్లాగానే అతను కూడా స్కూల్ కు వెళ్లాడట. మహేష్ తమ స్కూల్ కు రావడంతో అక్కడున్న పిల్లలతో పాటు, సిబ్బంది కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎన్నడూ బయటకు రాని తన తండ్రి ఏకంగా స్కూల్ కు వచ్చేసరికి గౌతమ్ కూడా ఎంతో ఆనందించాడట.

  • Loading...

More Telugu News