: ఉగ్రవాదంపై మీ పోరాటానికి పూర్తిగా సహకరిస్తాం: షరీఫ్ కు ఒబామా ఫోన్
పెషావర్ లో పాక్ తాలిబన్లు విద్యార్థులను ఊచకోత కోసిన నేపథ్యంలో, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా, ఉగ్రదాడిని ఖండించిన ఒబామా... అమెరికా ప్రజల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ చేసే యుద్ధానికి ఎలాంటి సహకారమైనా అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని షరీఫ్ కు స్పష్టం చేశారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో పాక్ ప్రజలకు అండగా యావత్ అమెరికా నిలుస్తుందని చెప్పారు.